Home  »  TV News  »  Brahmamudi : రాజుకు ఊహించని షాక్ ఇచ్చిన రేఖ.. ఇందు కోసం కన్నవారిని ఎదురించిన రాజు!

Updated : Jul 2, 2026

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -1073 లో.... రాజు దగ్గరికి ఇందు స్వీట్ పట్టుకొని వస్తుంది. ఇందు రావడం రాజు ఉహ అనుకొని తన పని తను చేసుకుంటాడు. రాజు అని ఇందు పిలుస్తున్నా కూడా అది నా ఉహే అనుకుంటాడు. నేను నిజంగానే వచ్చానని ఇందు అనగానే అయితే ఒకసారి కూర్చో , నిల్చొ అని చెప్తాడు. ఇందు చెప్పినట్లు చేస్తుంది. ఇది ఖచ్చితంగా ఉహే నువ్వు ఎందుకు నేను చెప్పినట్లు చేస్తావని రాజు అంటడు. ఒకసారి గిల్లు అనగానే ఇందు గిల్లుతుంది. అబ్బా నిజంగానే వచ్చావా అని రాజు అంటాడు. ఇదిగో స్వీట్ అని రాజుకి ఇందు తిన్పిస్తుంది. తనకి తినిపించిన స్వీట్ లో నుంచి ఇందు తింటుంది. అది చూసి రాజు ఆశ్చర్యంగా చూస్తాడు.

నీ వల్లే ఇదంతా నాకు ఎప్పుడు సపోర్ట్ గా ఉంటానని మాటివ్వమని రాజుని ఇందు అడుగుతుంది. మరొకవైపు రేఖ దగ్గరికి ఐశ్వర్య వెళ్లి.. మీరు నేను చెప్పింది నమ్మి ఉంటే మీకు ఈ పరిస్థితి వచ్చి ఉండేది కాదని ఐశ్వర్య అంటుంది. వాళ్ళు ఇద్దరు తోడు దొంగలు ఆంటీ.. వాళ్ళ పేరెంట్స్ ని ఇంతవరకు ఇంటికి ఎందుకు తీసుకొని రాలేదు.. ఎవరిని వాళ్ళ ఇంటికి ఎందుకు తీసుకొని వెళ్ళలేదని రేఖకి డౌట్ వచ్చేలా ఐశ్వర్య మాట్లాడుతుంది. మరొకవైపు నేను అనుకున్నది పూర్తి అయ్యేవరకు మన ముందు ఎవరున్నా నీకు సపోర్ట్ చేస్తానని ఇందుకి రాజు మాటిస్తాడు. మరొకవైపు వెంకీ ఫుడ్ డెలివరీకి వెళ్ళడానికి రెడీ అవుతాడు. అప్పుడే రాజు వాళ్ళ నాన్న చలపతి ఎవరికైతే అప్పు ఉన్నాడో అతని దగ్గరికి  రేఖ వెళ్తుంది. అతనితో అన్ని విషయాలు చెప్పి చలపతి ఇంటికి పంపిస్తుంది. అతన్ని చలపతి చూడగానే మీ అన్నకి తర్వాత ఇస్తానని చెప్పాను కదా అని చలపతి అంటాడు.

మీ వాడు గొప్పింటికి అల్లుడు అయ్యాడు. ఆ విషయాలు దాచి మమ్మల్ని మోసం చేస్తున్నావని అతను అనగానే మీరు ఏం అంటున్నారని వాళ్ళు ఆశ్చర్యంగా చూస్తారు. మీ రాజు దుగ్గిరాల ఇంటి వారసురాలు ఇందుని పెళ్లి చేసుకొని మంచిగా సెటిల్ అయ్యాడని అతను చెప్పగానే వాళ్ళు షాక్ అవుతారు. మీకు ఇరవై నాలుగు గంటలు టైమ్ ఇస్తున్నాను.. నా డబ్బు నాకూ ఇవ్వాలని అతను చెప్పేసి వెళ్ళిపోతాడు. అతను రేఖ దగ్గరికి వెళ్లి.. మీరు ఇన్ఫర్మేషన్‌ ఇచ్చి మంచి పని చేశారు.. నా డబ్బు నేను వసూల్ చేసుకుంటానని అతను అంటాడు. ఆ తర్వాత రాజు అక్కడ ఉండడం ఏంటి? వాడికి అక్కడ ప్రమాదం.. వెంటనే వెళ్లి తీసుకొని రావాలని చలపతి, లక్ష్మీ అనుకుంటారు. తరువాయి భాగంలో దుగ్గిరాల ఇంటికి చలపతి, లక్ష్మీ వెళ్లి రాజుని తీసుకొని వచ్చే ప్రయత్నం చేస్తారు. రాజు రానని చెప్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.






Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.